25.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ‌లోక్‌సభ ఎన్నికల్లో ‘నమో’ సునామీ.. ఏకంగా 303 స్థానాలు సొంతంగా గెలుచుకుని…

‌లోక్‌సభ ఎన్నికల్లో ‘నమో’ సునామీ.. ఏకంగా 303 స్థానాలు సొంతంగా గెలుచుకుని…

- Advertisement -

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 7 దశల్లో 542 లోక్‌సభ స్థానాలకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో నమో(నరేంద్ర మోడీ) హవా కొనసాగింది. 2014లో 282 స్థానాల్లో గెలుపుని సొంతం చేసుకున్న బీజేపీ… ఈసారి మరింత బలంగా మారి… ఏకంగా 303 స్థానాలు సొంతంగా గెలుచుకొని… తిరుగులేని శక్తిగా మారింది.

ఇక ఎన్డీయే పక్షాలని కలుపుని మొత్తం 353 స్థానాల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌కి ఈసారి కూడా చవుడెబ్బ తగిలింది. కేవలం ఆ పార్టీ 52 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలుపుకుని 92 స్థానాల్లో గెలుపొందింది. ఇతరులు 97 స్థానాల్లో సత్తా చాటారు.

చదవండి: బంపర్ మెజారిటీతో గెలిచిన మోడీ, రికార్డు తిరగరాసిన అమిత్ షా….

అయితే మోడీ ప్రభంజనం కేవలం ఉత్తరాది రాష్ట్రాలు, గుజరాత్‌కే పరిమితం కాలేదు. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ కమలం పార్టీ దూసుకెళ్లింది. అసలు ఎవరు ఊహించని విధంగా తెలంగాణలోనూ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. కానీ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది.

మొత్తం మీద దేశం అంతా మోడీ గాలి బలంగా వీచింది. ఇక మోడీ ఘనవిజయం సాధించడంతో…పలు దేశాల అధ్యక్షులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా దేశాధినేత జీ జిన్ పింగ్, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియాడెస్, ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ అధ్యక్షుడు గిస్సెపీ కాంటే, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పాటు నేపాల్, భూటాన్ దేశాల అధినేతలు సైతం మోడీకి అభినందనలు తెలియజేశారు.

చదవండి: కౌటింగ్ తరువాత రాహుల్ సంచలన నిర్ణయం..!
- Advertisement -