
ముంబై: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరో సారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ బచ్చన్… రైతన్నలకు చేయూతనిచ్చి మరో సారి రియల్ హీరో అని నిరూపించుకున్నారు. అప్పుల బారిన పడిన రైతు కుటుంబాలను ఆదుకుని… అప్పుల ఊబి నుంచి రక్షించాడు.
చదవండి:మూడు గంటలకు మించి తాజ్ మహల్ అందాలు ఆస్వాదించలేరు..
దేశంలో రైతన్నల ఆత్మహత్యలు పెరగడంతో అన్నదాతలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు అమితాబ్. ఇందులో భాగంగానే ఆర్థికంగా చితికిపోయిన రైతు కుటుంబాలకు అండగా నిలిచాడు. బీహార్ కు చెందిన అప్పులు తీర్చలేని 2100 మంది రైతుల ఎకౌంట్లలో డబ్బులు వేశాడు. మరి కొంత మందిని తన నివాసానికి పిలిపించుకుని మరీ… తన కొడుకు అభిషేక్ బచ్చన్, కూతురు శ్వేతా బచ్చన్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
ఇప్పుడు బీహార్ రైతుల అప్పులు తీర్చేసిన బిగ్ బీ… అంతకు ముందు ఉత్తరప్రదేశ్ అన్నదాతల అప్పుల భారాన్ని తీర్చి వారి కన్నీటిని తుడిచాడు. దాదాపు వెయ్యి మంది రైతులకు ఆర్థిక సాయాన్ని అందించి … నూతన జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేలా చేశాడు.
రైతుల పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తున్న అమితాబ్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయ్. బిగ్ బి నిజంగా సూపర్ స్టార్ అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. ఇతర హీరోలు కూడా బచ్చన్ ను ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు.








