22.6 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home క్రికెట్ మ్యాచ్ పై ఇంట్రెస్ట్ పెంచేందుకు ఇంత దిగజారాలా : సానియా

మ్యాచ్ పై ఇంట్రెస్ట్ పెంచేందుకు ఇంత దిగజారాలా : సానియా

- Advertisement -

భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. దాయాదుల పోరులో ఎవరు నెగ్గుతారనే విషయంలో ఆసక్తి ఎక్కువే. ముఖ్యంగా వరల్డ్ కప్ లో పాక్ – ఇండియా పోరు అంటే ప్రపంచం మొత్తం టీవీల ముందే కూర్చుంటుంది.

చదవండి: బిగ్ బీ ది రియల్ హీరో : రైతుల అప్పులు తీర్చేసిన అమితాబ్ బచ్చన్

ఈ నెల 16న భారత్ -పాక్ మ్యాచ్ ఉండడంతో .. ఈ ఫైట్ పై మరింత శ్రద్ధ పెంచేలా ఇండియా, పాకిస్థాన్ లో కొన్ని యాడ్స్ చక్కర్లు కొడుతున్నాయ్. భారత్ చేతిలో పాక్ గోప పరాభావాన్ని మూటగట్టుకున్న తీరుపై ఇండియాలో ఓ అడ్వర్టైజ్ మెంట్ చాలా పాపులర్ అయింది. అదే విధంగా పాకిస్థాన్ మీడియాలో వింగ్ కమాండర్ అభినందన్ వేషధారణలో ఉన్న యాడ్ షికార్లు కొడుతుంది. భారత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న ఈ వీడియోను రూపొందించింది పాక్.

అయితే భారత బిడ్డ… పాకిస్థాన్ కోడలు అయిన సానియా మీర్జా ఈ యాడ్ లను జీర్ణించుకోలేక పోయారు. వరల్డ్ కప్ మ్యాచ్ పై ఇంట్రెస్ట్ పెంచేందుకు మరీ ఇంత దిగజారాల్సిన అవసరం లేదన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

ఇలాంటి చెత్త పనులతో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసర విషయాలపై ఇంత శ్రద్ధ అవసరం లేదేమో అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

- Advertisement -