27.2 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ మెగాస్టార్ చిరు చిన్నల్లుడికి ఆకతాయిల వేధింపులు

మెగాస్టార్ చిరు చిన్నల్లుడికి ఆకతాయిల వేధింపులు

- Advertisement -

హైదరాబాద్ : మెగాస్టార్ చిరు చిన్నల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్ కు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయ్. చిరు చిన్నకూతరుని పెళ్లి చేసుకున్న తర్వాత విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్.. నటన పరంగా మంచి మార్కులే కొట్టేశాడు.

చదవండి:మ్యాచ్ పై ఇంట్రెస్ట్ పెంచేందుకు ఇంత దిగజారాలా : సానియా

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ దేవ్ కు కొన్నాళ్లుగా ఆకతాయిల వేధింపులు ఎక్కువయ్యాయ్. తనతో పాటు తన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ … పదే పదే అసభ్యకర పోస్టులు చేస్తుండడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇన్ స్టాగ్రామ్ లో ముఖ్యంగా పది ఎకౌంట్ల నుంచి రిపీటెడ్ గా అసభ్యకర పోస్టులు వస్తున్నాయని చెప్పాడు.

కళ్యాణ్ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోకిరీల వివరాలు తెలుసుకునేందుకు ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాశారు. తదుపరి విచారణ జరిపి.. పోకిరీల కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -