26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ నాగబాబు అనుభవ పాఠాలు.. లేస్తాం.. గెలుస్తాం….

నాగబాబు అనుభవ పాఠాలు.. లేస్తాం.. గెలుస్తాం….

Nagababu Latest News, Janasena Latest Updates, AP Political Updates News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: మెగా బ్రదర్ నాగబాబు తన అనుభవ పాఠాలు నేర్పుతున్నారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయంతో అభిమానులు నిరాశ నిస్పృహలకు లోను అయ్యారు. దీంతో జనసేనుల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు నాగబాబు.

చదవండి:మూడు గంటలకు మించి తాజ్ మహల్ అందాలు ఆస్వాదించలేరు..

సోషల్ మీడియా వేదికగా… జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను మోటివేట్ చేస్తున్నారు. ఘోర పరాభావం నుంచి జనసైన్యాన్ని బయటకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటమి గెలుపుకు నాంది అని… దెబ్బలు తగిలితేనే రాటు తేలుతామని .. భవిష్యత్ జనసేనదే అంటూ ఉత్సాహం నింపేందుకు ట్రై చేస్తున్నారు.

నొప్పి రెండు రకాలుగా ఉంటుందంటూ తన సోషల్ మీడియా పేజీలో ఓ పోస్ట్ పెట్టారు. ఒకటి మిమ్మల్ని బాధిస్తే… మరొకటి మీలో మార్పు తెస్తుందన్నారు. దీంతో నాగబాబు పోస్టుపై నెటిజన్ల రియాక్షన్ అద్భుతంగా ఉంది.

జనసేన ఓటమి మాలో మార్పు తీసుకొచ్చిందని రిప్లై ఇస్తున్నారు. తప్పకుండా లేస్తాం.. బలంగా గెలుస్తాం అంటూ స్పష్టం చేస్తున్నారు. మంచి మనిషి నచ్చేందుకు కాస్త సమయం పడుతుందని… జనసేనాని పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఆదరిస్తారని… మరో ఐదేళ్ల తర్వాత విజయం మనదే అంటూ పోస్ట్ కు లైక్ లు కొట్టేస్తున్నారు.

చదవండి: జగన్ మరో సంచలన నిర్ణయం: రోజా కు కీలక పదవి!

- Advertisement -