26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వరల్డ్! గూగుల్ ఏం చూపిస్తుందో తెలుసా!?

బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వరల్డ్! గూగుల్ ఏం చూపిస్తుందో తెలుసా!?

best toilet pepar in the worled
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత నాణ్యమైన టాయిలెట్ పేపర్ ఏదో మీకు తెలుసా? తెలియకుంటే ఒక్కసారి గూగుల్‌లో వెతకండి. అయితే, అదిచ్చే సమాధానం చూసి మాత్రం ఆశ్చర్యపోవద్దు! ఎందుకంటే? మీరా ప్రశ్న అడగానే వెంటనే పాకిస్తాన్ జాతీయ జెండాలను స్క్రీన్‌పై చూపిస్తోంది.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర వాటిల్లో పాక్ జెండా ‘బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వరల్డ్’ హ్యాష్‌ట్యాగ్‌తో హోరెత్తిపోతోంది.

గూగుల్‌కి ఇదే కొత్త కాదు…

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో ఈ నెల 14న జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దశాబ్దాల తర్వాత భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే.  అయితే గూగుల్ ఇలా సంబంధం లేని ఫొటోలను చూపించడం  కొత్తేమీ కాదు. గతేడాది ‘ఇడియట్’ అన్న పదానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోను కూడా చూపించింది.

- Advertisement -