ఆ విమానం ఆచూకి మోడీని అడిగితే చెప్పేవారుగా: మోడీపై ఓవైసీ సెటైర్

asaduddin-owaisi
- Advertisement -

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా..గత మే నెలలో ప్రధాని మోడీ ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన రోజున దట్టంగా అలముకున్న మేఘాల వల్లే పాకిస్థాన్ రాడార్లు మన యుద్ధ విమానాలను కనిపెట్టలేకపోయాయని చెప్పిన విషయం తెలిసిందే.

అయితే మోడీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఫుల్ సెటైర్లు వేశాయి. ఈ నేపథ్యంలో మరోమారు మోడీ వ్యాఖ్యలని గుర్తు చేస్తూ…ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్ విసిరారు. తాజాగా ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ నెల3న భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం అదృశ్యమైన సంఘటన గురించి ప్రస్తావిస్తూ… అదృశ్యమైన ఆ విమానం ఆచూకీ గురించి మోడీని అడిగితే సరిపోయేదని అన్నారు.

అలాగే ఈ విమానం ఆచూకి చెప్పిన వారికి రూ.5 లక్షలు బహుమతిగా ఇస్తామని భారత వైమానిక దళం ప్రకటించిందని,  మోడీ చెబితే ఆ ఐదు లక్షలు ఆదా అయ్యేవని సెటైర్లు విసిరారు.

చదవండి: కాంగ్రెస్ పోరాటం ఆగదు… ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు?
- Advertisement -