
లండన్: ప్రపంచకప్‌లో భాగంగా నిన్న వెస్టిండీస్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి వరుణుడు బ్రేక్ వేశాడు. 8వ ఓవర్ జరుగుతుండగా వర్షం ప్రారంభం కావడంతో ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
ఇక అంతకుముందు టాస్ గెలిచిన విండీస్ సఫారీలకు బ్యాటింగ్ అప్పగించింది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 11 పరుగుల వద్ద హషీం ఆమ్లా (6) అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే మార్కరమ్(5) పెవిలియన్ చేరాడు. రెండు వికెట్లు కాట్రెల్‌కే దక్కాయి.
ఈ క్రమంలో 7.3వ ఓవర్లలో 29/2 పరుగుల స్కోరు ఉన్న సమయంలో వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో ఇరు జట్లకు చెరో రెండు పాయింట్లు దక్కాయి.
ఇక పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్ 3 మ్యాచ్‌లో 2 గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో…భారత్ 2 మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.








