ఏపీ గవర్నర్‌గా రావట్లేదు…ఆ వార్తల్లో నిజం లేదు: సుష్మా

Sushma Swaraj Latest Updates, AP Governor Latest News, AP Updates, Newsxpressonline
- Advertisement -

ఢిల్లీ:  కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా  నియమితులైనట్లు నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై సుష్మా స్పందించారు. ఏపీ గవర్నర్‌గా నియమితులైనట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు.

అయితే నిన్న కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సుష్మా స్వరాజ్‌కు అభినందనలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. దీంతో ఆమె ఏపీకి గవర్నర్‌గా నియమితులయ్యారని అంతా భావించారు. ఇక ఇంతలోనే ఆయన ఇది ఫేక్ వార్త అని తెలుసుకుని…. తన ట్వీట్‌ను డిలీట్ చేశారు.

ఆ తర్వాత కొద్ది సేపటికే సుష్మా స్వరాజ్ స్పందించారు. తాను ఏపీకి గవర్నర్‌గా నియమితులైనట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు.

కాగా, గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన సుష్మా…అనారోగ్య కారణాలతో ఈ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అలాగే మోడీ కేబినెట్ లో బెర్త్ కూడా దక్కలేదు. ఈ క్రమంలోనే ఆమెను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపుతారని వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే నిన్న సుష్మా ఏపీకి గవర్నర్ గా వస్తున్నారని ప్రచారం జరిగింది.

చదవండి: పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన?
- Advertisement -