28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం సంచలన నిర్ణయం: పాకిస్తాన్ నటీనటులు, కళాకారులపై మన సినీ ఇండస్ట్రీలో నిషేధం!

సంచలన నిర్ణయం: పాకిస్తాన్ నటీనటులు, కళాకారులపై మన సినీ ఇండస్ట్రీలో నిషేధం!

pak actress, newsxpress.online
- Advertisement -

pakisthan, newsxpress.online

న్యూఢిల్లీ: పాకిస్తాన్ విద్రోహ చర్యలకు భారత్ అంతే దీటుగా బుద్ది చెబుతోంది. ఇప్పటికే పలు విధాలుగా చర్యలు మొదలు పెట్టిన ఇండియా తాజాగా ఆ దేశ నటీనటులఫై కూడా చర్య తీసుకుంది. ఇకఫై భారతీయ చిత్రాల్లో పాక్ నటీనటులను తీసుకోకూడదని ఆదేశించింది. ఈ మేరకు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యుఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో 49 మంది జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత సినీ పరిశ్రమలో ఇకపై పాకిస్తాన్ నటులు, గాయకులు, ఇతరత్రా కళాకారులను ప్రోత్సహించబోమని ఏఐసీడబ్ల్యుఏ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏఐసీడబ్ల్యుఏ ప్రధాన కార్యదర్శి రోనక్ సురేష్ జైన్ సోమవారం అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

పాకిస్తాన్ నటులు, కళాకారులపై పూర్తిగా బ్యాన్…

”పుల్వామాలో భారత జవాన్లపై దాడిని భారత సినీ వర్కర్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. అమానవీయత, తీవ్రవాదానికి వ్యతిరేకంగా దేశానికి మద్దతుగా ఉంటాం.  మన ఇండస్ట్రీలో పనిచేస్తున్న పాకిస్తాన్ నటులు, కళాకారులపై పూర్తిగా బ్యాన్ విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నాం. ఆ దేశ నటులు, కళాకారులతో ఎవరైనా పని చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..” అని ఆ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -