28.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home టెలివిజన్ మరో బయోపిక్! ‘విశ్వదర్శనం’గా కళాతపస్వి జీవిత చరిత్ర, టీజర్ రిలీజ్…

మరో బయోపిక్! ‘విశ్వదర్శనం’గా కళాతపస్వి జీవిత చరిత్ర, టీజర్ రిలీజ్…

viswadarshanam
- Advertisement -

k viswanandh

హైదరాబాద్: తెలుగు తెరకి కళాత్మక చిత్రాలను పరిచయం చేసిన దర్శకుడు కె.విశ్వనాథ్. కథకు కళను జోడించి కమనీయంగా నడిపించిన కళాతపస్వి ఆయన. ఆయన సినిమాలను మనసుతో చూడాలి, మనసుతోనే వినాలి. అప్పుడు మాత్రమే ఆ సినిమాలు అర్థమవుతాయి.. అందమైన అనుభూతిని ఆవిష్కరిస్తాయి. మంగళవారం కళాతపస్వి కె.విశ్వనాథ్ జన్మదినం.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘విశ్వదర్శనం’ పేరుతో విశ్వనాథ్ జీవిత చరిత్రను తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు జనార్ధన మహర్షి రంగంలోకి దిగారు. ‘విశ్వదర్శనం’ అనే టైటిల్ కి ‘వెండితెర చెప్పిన బంగారు దర్శకుడి కథ’ అనేది ట్యాగ్ లైన్‌గా పెట్టారు. విశ్వనాథ్ చేతుల మీదుగా టీజర్‌‌ను కూడా లాంచ్ చేశారు.

నాపై గల అభిమానంతో…

ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ … “నేనెవరన్నది ప్రపంచానికి చాటి చెప్పాలనే దురుద్దేశం నాకు లేదు. నాపై గల అభిమానంతో జనార్ధన మహర్షి చేస్తోన్న ప్రయత్నం ఇది. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..” అన్నారు.

అలాగే తనికెళ్ల భరణి మాట్లాడుతూ .. “విశ్వదర్శనం అంటే విశ్వనాథ్‌గారు దర్శించిన సమస్త విషయాలను మనం దర్శించడం. విశ్వనాథ్‌గారికి జనార్ధన మహర్షి అభిమాని కాదు, భక్తుడు. ఆయన ఇండస్ట్రీకి రావడానికి కారకులు విశ్వనాథ్‌గారే. గురువు పట్ల కృతజ్ఞతా భావంతో ఆయన ఈ సినిమా చేస్తున్నాడు..” అని అన్నారు.

ఇక దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ .. “విశ్వనాథ్‌గారి వ్యక్తిత్వం, సమాజంపై ఆయన సినిమాలు చూపిన ప్రభావం గురించి ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది..” అని చెప్పారు.

- Advertisement -