23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు: సుప్రీంకు కేరళ ప్రభుత్వం వెల్లడి

శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు: సుప్రీంకు కేరళ ప్రభుత్వం వెల్లడి

sabarimala
- Advertisement -

తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన 10 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళల జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది కేరళ ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటి వరకు శబరిమల ఆలయంలోకి 51 మంది మహిళలు ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. వారందరూ 50 ఏళ్ల వయసులోపు వారేనని పేర్కొంది.

అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టిన తొలి ఇద్దరు మహిళలు తమకు భద్రత కల్పించాలని న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇప్పటివరకు ఆలయంలోకి ప్రవేశించిన మహిళల జాబితాను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేసింది.

51మంది మహిళలు క్షేమంగానే..

దాదాపు 16 లక్షల మంది భక్తులు ఆలయ ప్రవేశానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, వారిలో ఏడు వేల మంది మహిళలున్నారని.. వారంతా పది నుంచి 50 ఏళ్ల వయసులోపు వారేనని ప్రకాశ్ అనే కేరళ ప్రభుత్వ అధికారి తెలిపారు. 16 లక్షల మందిలో 8.2 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారని, ఇక ఏడు వేల మందిలో ఆలయంలోకి ప్రవేశించింది కేవలం 51 మందేనని చెప్పారు. వారంతా క్షేమంగానే అయ్యప్ప దర్శనం చేసుకున్నారని తెలిపారు.

మొత్తానికి 2018లో ఇప్పటివరకు అయ్యప్పను దర్శించుకున్నవారి సంఖ్య 44 లక్షలని సదరు అధికారి చెప్పారు. ఇద్దరు మహిళల పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తూ వారికి ఇరవై నాలుగు గంటలూ భద్రత కల్పిస్తామని పేర్కొంది. ఆలయంలోని ప్రవేశించిన మహిళల్లో ఒకరైన కనకదుర్గపై ఆమె అత్త దాడికి దిగడంతో బాధితురాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

- Advertisement -