23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మళ్ళీ రెచ్చిపోయిన మావోలు…ఐ‌ఈ‌డి పేలుడులో 12 మంది జవాన్లు మృతి

మళ్ళీ రెచ్చిపోయిన మావోలు…ఐ‌ఈ‌డి పేలుడులో 12 మంది జవాన్లు మృతి

- Advertisement -

రాంచీ: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. జార్ఖండ్‌లోని కుచాయ్ అటవీ ప్రాంతంలో భారీ పేలుళ్లతో జవాన్లపై విరుచుకు పడ్డారు. ఐఈడీతో కమెండోల వాహనాన్ని పేల్చివేసి.. 12 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు.

ఈ దారుణ ఘటనలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డవారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఇక మృతిచెందిన వారిలో 9 మంది కోబ్రా జవాన్లు, 3 పోలీసులు ఉన్నారు.

కుచాయ్ అటవీ ప్రాంతం వైపు భద్రతా సిబ్బంది వస్తారని ముందే ఊహించిన మావోయిస్టులు.. అత్యంత శక్తిమంతమైన ఐఈడీని అమర్చారు. ఇక ఘటనా స్థలంలో భారీగా మోహరించిన బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ నెల 1 కూడా మహారాష్ట్రలో మావోయిస్టులు జాంబీర్ అడవుల్లో జవాన్లే లక్ష్యంగా ఐఈడీని పేల్చిన విషయం తెల్సిందే. ఆ ఘటనలో 15 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి చెందాడు.

చదవండి: ర్నూలులో దారుణం: కేఈ కృష్ణమూర్తి అనుచరుడు శేఖర్ రెడ్డి దారుణహత్య…
- Advertisement -