
హైదరాబాద్: తెలుగు సినిమా ప్రపంచానికి రారాజు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా దరకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ కొత్త సినిమాని ప్రకటించారు.
ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో సినిమా గురించి ప్రకటన చేశారు. తన యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది అని, గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉందని అన్నారు.
ఇక తన కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం కానుందని, మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నానని, పూర్తి వివరాలు త్వరలో…” అని అన్నారు. అలాగే ముగ్గురు డైరెక్టర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతూ ఓ పోస్టర్ ను కూడా రాఘవేంద్రరావు విడుదల చేశారు.
కాగా, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వరా భక్తి చానల్ కు దర్శకుడు రాఘవేంద్రరావు నిన్న రాజీనామా చేశారు.








