25.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం బిలియనీర్‌ని మట్టికరిపించి పార్లమెంట్‌కి పయనమైన సామాన్యుడు….

బిలియనీర్‌ని మట్టికరిపించి పార్లమెంట్‌కి పయనమైన సామాన్యుడు….

- Advertisement -

ఢిల్లీ:  ఒడిషాలోని ఓ సామాన్యుడు సంచలనం సృష్టించాడు….ఎన్నికల్లో పైసా ఖర్చు పెట్టే స్తోమత లేకపోయిన…ఓ బిలియనీర్ అభ్యర్ధిని ఓడించి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నాడు. అతి సామాన్య వ్యక్తి అయిన ప్రతాప్ సారంగి….ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒడిషాలోని బాలాసోర్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేడీ అభ్యర్ధి రబీంద్ర కుమార్‌పై 12వేల మెజారిటీతో గెలిచారు.

(Source: @SulagnaDash6/Twitter)

అయితే గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఓడిపోయిన ప్రతాప్… ఈ ఎన్నికల్లో కష్టపడి పైసా ఖర్చు చేయకుండా…ఆటొలో ప్రచారం చేసి….అపోజిట్ ఉన్న బిలియనీర్ అభ్యర్ధిని చిత్తుగా ఓడించాడు.

కాగా, ప్రతాప్… సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆదివాసీ ప్రాంతమైన మయూర్ భంజ్, బాలాసోర్‌లలో పాఠశాలలు నెలకొల్పారు. ఒడిషా మోడీగా పేరు తెచ్చుకున్నప్రతాప్… మద్యం, అవినీతి, పోలీసుల దురాగతాలపై ఉద్యమించారు. ఇక ఈయన గతేడాది తల్లి మరణించేవరకు ఆమెతో కలిసి ఓ చిన్న గదిలోనే నివాసమున్నారు.

(Source: @SulagnaDash6/Twitter)

అలాగే ఎంత దూరం ప్రయాణమైన సైకిల్ మీద తిరిగే…ప్రతాప్ ఎన్నికల్లో గెలిచాక కూడా తన బ్యాగును తానే సర్దుకుని ఢిల్లీకి పయనమయ్యారు. ఇదిలా ఉంటే సామాన్య వ్యక్తి పార్లమెంట్‌కి వెళ్లబోతున్నడంటూ…సోషల్ మీడియాలో ఈయనపై నెటిజన్లు ప్రతాప్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

(Source: @SulagnaDash6/Twitter)

ఇక ఆయన అతి సామాన్యంగా గడిపే జీవితానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే ఆయన నిరాడంబర జీవితాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. అందరు నాయకులు ఇలా ఉంటే ఎంత బాగుండేది అనుకుంటున్నారు.

(Source: @SulagnaDash6/Twitter)

చదవండి: మమతకి షాక్: బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ముగ్గురు టీఎంసీ ఎమ్మెల్యేలు…
- Advertisement -