పనిలో పనిగా అసెంబ్లీని కూడా రద్దు చేయండి: చంద్రబాబు

- Advertisement -

అమరావతి: శాసనమండలి రద్దుపై అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. శాసనమండలిని రద్దు చేసినట్టే పనిలో పనిగా అసెంబ్లీని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు ఎదుర్కొవడానికి వెళ్తే ప్రజలు ఎవరితో ఉన్నారో తేలిపోతుందని అన్నారు.

ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటామని అన్నారు. అమరావతిపై ప్రజాభిప్రాయం కోరాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని కావాలని ప్రజలు కోరితే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులను ప్రజలు ఓప్పుకోవడంలేదని చంద్రబాబు తెలిపారు. అమరావతి మార్పును అందరూ వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. విజయనగరం జిల్లాలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు రాష్ట్రం కోసం త్యాగం చేశారని చంద్రబాబు తెలిపారు.

ఓటింగ్ సమయంలోనూ నాటకాలు ఆడారని చంద్రబాబు ఆరోపించారు. అసెంబ్లీలో 121మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మండలి రద్దు తీర్మానానికి 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఉన్నారని ప్రకటించడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని వైసీపీ నాటకాలు అడుతోందని మండిపడ్డారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ ఆశలు చూపించిందని ఒక్కరు కూడా డబ్బుకు ఆశపడలేదని ప్రశంసించారు.

- Advertisement -