
- Advertisement -
అమరావతి: ఏపీ అంసెబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని అమోదించింది. ఈ ఉదయం శాసనమండలి రద్దు ప్రవేశపెట్టగా సభ్యులు చర్చించారు. చర్చలో పాల్గొన్న సభ్యులంతా శాసనమండలి రద్దుకే మొగ్గు చూపారు.
చివరిగా ముఖ్యమంత్రి జగన్ చర్చలో పాల్గొని శాసన మండలిని ఎందుకు రద్దు తీర్మానం ప్రవేశపెట్టడానికి గల కారణాలు వివరించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఓటింగ్ నిర్వహించారు.
మండలి రద్దుకు అనుకూలంగా 133 ఓట్లు రాగా, వ్యతికంగా ఎవరూ లేరని స్పీకర్ ప్రకటించారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేశారు.
- Advertisement -








