రాహుల్ నమ్మకాన్ని నిలబెడతా: ఊమెన్ చాందీ, ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా బాధ్యతల స్వీకరణ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఊమెన్ చాందీ గురువారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో పార్టీ వ్యవహారాల బాధ్యత ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, పార్టీ అధినేత రాహుల్ గాంధీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వ్యాఖ్యానించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ మంచి పట్టు ఉందని, ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను క‌ృషి చేస్తానని, పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా పని చేస్తానని  ఊమెన్ చాందీ చెప్పారు. మరోవైపు, బెంగుళూరులో రాహుల్ గాంధీ, చంద్రబాబులు చేతులు కలిపినప్పటి నుంచి కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయాయంటూ బీజేపీ, వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆయన ఎలా జవసత్వాలు తీసుకురాబోతున్నారు? అసలు ఊమెన్ చాందీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -