ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి యనమల! కొత్తగా ఆరు పథకాలు…

yanamala ramakrishna
- Advertisement -

yanamala ramakrishna

ఏపీ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ బడ్జెట్ తో కలిపి మొత్తంగా యనమల 11 సార్లు శాసనసభలో బడ్జెట్ ని పెట్టాడు.

ఇకపోతే ఈ సారి బడ్జెట్‌లో ఆరు కొత్త పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతూ నిధులను మంజూరు చేసింది. రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించింది.

కొత్తగా ప్రకటించిన పథకాల వివరాలు….

* అన్నదాత సుఖీభవకు రూ.5వేల కోట్లు
* క్షత్రియ కార్పొరేషన్‌కు రూ.50కోట్లు
* హౌస్ సైట్స్ భూ సేకరణకు రూ.500 కోట్లు
* ఎమ్.ఎస్.ఎమ్.ఈ. ప్రోత్సాహానికి రూ.400కోట్లు
* డ్రైవర్స్ సాధికార సంస్థకు రూ.150 కోట్లు
* మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.100కోట్లు
వీటితో పాటు నిరుద్యోగ భృతిని రూ.2వేలకు పెంచిన ప్రభుత్వం

- Advertisement -