కేంద్రంలో ఎన్డీయే స్వీప్.. ఏపీలో వైసీపీ దూకుడు…

YS Jagan Latest Updates, AP Election News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హయాంలోని ఎన్డీయే తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మొత్తం 265 స్థానాల్లో ఎన్డీయే కూటమి బంపర్ ఆధిక్యంలో ఉంది. అలాగే కాంగ్రెస్ హయాంలోని యూపీఏ 80 స్థానాల్లో, ఇతరులు 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఇటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం మారబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వైసీపీ దాదాపు 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇక తెలుగుదేశం 23 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది.  జనసేన 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఆధిక్యం చూపిస్తోంది. తాజాగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి రాజాం, శ్రీకాకుళం, పాతపట్నం, ఇచ్ఛాపురం, టెక్కలి, నరసన్నపేట, ఎచ్చెర్ల, పలాస, ఆముదాల వలస, పాలకొండ నియోజకవర్గాల్లో వైసీపీ లీడ్ లో కొనసాగుతోంది.

మరోవైపు నెల్లూరు అర్బన్ లో టీడీపీ అభ్యర్థి నారాయణపై వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ లీడ్ లో కొనసాగుతున్నారు. అలాగే జిల్లాలోని నెల్లూరు రూరల్, కావలి, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ ఫ్యాను జోరు కొనసాగుతోంది.

- Advertisement -