34.3 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ తొలి రౌండ్‌లో ఫ్యాన్ ఆధిక్యత.. వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు…

తొలి రౌండ్‌లో ఫ్యాన్ ఆధిక్యత.. వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు…

YS Jagan Updates, AP Election Updates News, AP political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఆధిక్యత కొనసాగుతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్‌ను పూర్తి చేశారు.

ఇక తొలి రౌండ్‌లో తెలుగుదేశం పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో సాగుతోంది. వైసీపీ నుంచి మైదుకూరులో ఎస్ రఘురామిరెడ్డి, నెల్లూరు టౌన్ లో పోలుబోయిన అనిల్ కుమార్, కడపలో షేక్ అంజాద్ బాషా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్, మచిలీపట్నంలో పేర్ని నాని (వెంకట్రామయ్య), అరకులో చెట్టి ఫాల్గుణ, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టెక్కలి నుంచి పేరాడ తిలక్, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు ఆధిక్యంలో ఉన్నారు

ఇప్పటివరకూ వైసీపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా…టీడీపీ 9 స్థానాల్లో ఆధిక్యం ఉంది. ఇక జనసేన 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

- Advertisement -