25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ బిగ్ బ్రేకింగ్: కుప్పంలో చంద్రబాబు వెనుకంజ…

బిగ్ బ్రేకింగ్: కుప్పంలో చంద్రబాబు వెనుకంజ…

Chandrababu Naidu Varthalu, AP political News, AP Election News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వెలువడేలా ఉన్నాయి. ఇప్పటికే భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న వైసీపీ పార్టీ….తిరుగులేని విజయం సాధించే దిశగా సాగుతుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తాను పోటీ చేసిన చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి అనూహ్య ఫలితం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన డాక్టర్ చంద్రమౌళి 357 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు లీడింగ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక మొత్తం 104 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా..టీడీపీ 23 స్థానాల్లో లీడింగ్ ఉంది. ఇక జనసేన 2 స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తుంది.

తెలంగాణలో దూసుకుపోతోన్న కారు…

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది.

సికింద్రాబాద్‌, చేవెళ్ల, భువనగిరి, మహబూబ్‌నగర్‌‌, జహీరాబాద్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, మెదక్‌, పెద్దపల్లి స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో మిత్రపక్షమైన ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ మాత్రం ఓ చోట ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.

 

- Advertisement -