
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళుతోంది. 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 128 స్థానాల్లో తిరుగులేని ఆధిక్యం కొనసాగిస్తుంది.
ఇక తెలుగుదేశం 30 స్థానాల్లోనూ, జనసేన 2 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇక లోక్ సభ విషయానికి వస్తే వైసీపీ 15 చోట్ల, టీడీపీ 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఏపీలోని 13 జిల్లాలో వైసీపీకి బంపర్ మెజారిటీ వచ్చేలా ఉంది.
అటు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 10 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ 1, ఎంఐఎం 1 ఆధిక్యంలో ఉంది.
ఇక సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 317 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 83 స్థానాల్లో, ఇతరులు 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
అటు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మమత సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ మూడు స్థానాల్లోనూ, ఇతరులు ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు.








