షాకింగ్: ఓటమి దిశగా ఏపీ మంత్రులు, తీవ్ర నిరాశలో జనసేన…

YS Jagan Latest Updates, Chandrababu Naidu Varthalu, AP Election News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ స్పష్టమైన ఆధిక్యంగా దిశగా దూసుకుపోతుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీ 149 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక టీడీపీ కేవలం 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఎంతో ప్రభావం చూపుతుంది అనుకున్న జనసేనకు తీవ్ర నిరాశ ఎదురయింది.

అసలు జనసేన అభ్యర్థులు గెలవడం పక్కనపెడితే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అడ్రస్సే ఇప్పుడు గల్లంతు అయ్యేలా ఉంది. ఇంతకముందు వరకు పవన్ కల్యాణ్ భీమవరంలో రెండో స్థానంలో కొనసాగిన తర్వాత ఆధిక్యంలోకి వచ్చారు. ఇక  గాజువాకలో అయితే మూడోస్థానంలో కొనసాగుతున్నారు. అయితే రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక లోక్ సభ ఎన్నికలను పరిశీలిస్తే,

చదవండి:  కేంద్రంలో ఎన్డీయే స్వీప్.. ఏపీలో వైసీపీ దూకుడు…

ఇక తెలుగుదేశం ప్రభుత్వంలోని ఎంతో మంది మంత్రులు ఓటమి దిశగా పయనిస్తున్నారు మంత్రులు నారాయణ, అఖిలప్రియ, గంటా, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి తదితరులు వెనుకంజలో ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ పడిన నారా లోకేశ్, తొలి రౌండ్ లో స్వల్ప ఆధిక్యాన్ని చూపించినప్పటికీ, ఆపై వెనుకబడిపోయారు. ఇక్కడ మూడో రౌండ్ ముగిసేసరికి ఆళ్ల రామకృష్ణారెడ్డి దూసుకొచ్చారు. అటు హిందూపురంలో బాలకృష్ణ కూడా వెనుకంజలో ఉన్నారు.

ఇక తెలంగాణలో నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత వెనుకంజలో ఉన్నారు. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ కవితపై 18,000 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మరోవైపు మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖరరెడ్డి అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి, తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని కిరణ్ కుమార్ యాదవ్ పై లీడింగ్ లో దూసుకుపోతున్నారు.

సార్వత్రిక ఎన్నికల విషయానికొస్తే ఎన్డీయే 334 చోట్ల, యూపీఏ 83 స్థానాల్లో, ఇతరులు 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

చదవండి: బిగ్ బ్రేకింగ్: కుప్పంలో చంద్రబాబు వెనుకంజ…

- Advertisement -