ఒక సవాల్‌గా తీసుకుని పని చేయండి: కోవిడ్-19పై సీఎం జగన్‌కు.. చంద్రబాబు లేఖ

chandra-babu-naidu
- Advertisement -

అమరావతి: రాష్ట్రంలో విస్తృతంగా ప్రబలుతున్న కరోనా వైరస్ గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

చదవండి: ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం.. కరోనా బాధితులకు వైద్యం చేస్తూ మరణిస్తే రూ.కోటి…

కరోనా వైరస్ అంశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చంద్రబాబు ఆ లేఖలో జగన్‌కు హితవుపలికారు. కోవిడ్-19 నివారణను సవాల్‌గా తీసుకుని పని చేయాలని కోరారు.

‘‘ల్యాబ్‌లు, పరీక్షలు పెంచండి..’’

ఏపీలో ల్యాబ్‌లు పెంచాలని, ఎక్కువ పరీక్షలు చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన పేదలు ఆకలితో పస్తులుండకుండా అన్న క్యాంటీన్లు మళ్లీ తెరిచి వారిని ఆదుకోవాలని కోరారు.

చదవండి: ఏపీలో ప్రమాద ఘంటికలు.. ఒక్క రోజులోనే రెట్టింపైన కరోనా కేసులు

కరోనా పాజిటివ్ కేసులను దాచిపెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, వాస్తవాలను తొక్కిపెట్టడం మంచిదికాదన్నారు. ఓ వైపు ప్రభుత్వం భౌతిక దూరం పాటించాలని చెబుతూనే.. రేషన్‌ పేరుతో జనాల్ని ఒకే చోటుకు చేర్చడం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

వైద్యలు, సిబ్బందికి పీపీఈలు అందజేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం కూడా సరికాదని చంద్రబాబు.. సీఎం జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

చదవండి: భార్యాభర్తల మధ్య కరోనా చిచ్చు.. పరీక్షలు చేయించుకుంటేనే కాపురమన్న భార్య!
- Advertisement -