28.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జీతాలు ఆపడం దారుణం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ఉద్యోగుల జీతాలు ఆపడం దారుణం: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు

- Advertisement -

అమరావతి: ఉద్యోగుల వేతనరాలు ఆపడం దారుణమని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్  తన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ఉద్యోగుల వేతనాలు ఆపడం సరికాదన్నారు. 

ఉద్యోగుల జీతాల పెంపుపై ఇచ్చిన హామీని జగన్‌ నెరవేర్చలేదన్నారు.  ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం లేదని, పెన్షనర్లకు కూడా చెల్లింపులు ఆపే హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు.

జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, రాజకీయంగా లబ్ధిపొందడానికే జగన్ జీవో తీసుకొచ్చారని అశోక్ బాబు ఆరోపించారు.

చదవండి: కోవిడ్‌-19ను తేలిగ్గా తీసుకోవద్దు: జగన్‌కు చంద్రబాబు లేఖ
చదవండి: వారి వల్లే రాష్ట్రంలో కరోనా మరింత వ్యాప్తి.. ఒకేరోజు 70 మందికి పాజిటివ్: ఏపీ సీఎం జగన్
 
- Advertisement -