22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ స్పందించిన కేటీఆర్.. గంటల వ్యవధిలోనే ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు!

స్పందించిన కేటీఆర్.. గంటల వ్యవధిలోనే ఆ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు!

- Advertisement -

వనపర్తి: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయా పోస్టులపై చురుగ్గా స్పందిస్తుంటారు. లాక్‌డౌన్ నేపథ్యంలో కుమారుడితో కలిసి బయటకు వచ్చిన ఓ వ్యక్తిని వనపర్తికి చెందిన కానిస్టేబుల్ చితకబాదుతున్న వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఇలాంటి వారి వల్ల మొత్తం పోలీసులకే చెడ్డ పేరు వస్తోందని పేర్కొంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. 

ఆయన పోస్టుపై కేటీఆర్ స్పందించారు. మీరు చెప్పింది నిజమేనంటూ ఇలాంటి వారి వల్ల మిగతా పోలీసుల కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: కోవిడ్-19 ఎఫెక్ట్: ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను లాంచ్ చేసిన కేంద్రం…

అంతేకాదు, ఈ ఘటనపై విచారణ జరిపి సదరు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే కొన్ని గంటల్లోనే దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్‌ అశోక్‌‌ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అపూర్వారావు ప్రకటించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

వనపర్తికి చెందిన మురళీకృష్ణ (బాధితుడు) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా అతడికి ఇంటి నుంచి పని చేసేలా కంపెనీ వెసులుబాటు కల్పించింది.

దీంతో మురళీకృష్ణ కుటుంబం సహా వనపర్తికి వచ్చాడు. బుధవారం సాయంత్రం మురళీకృష్ణ కుటుంబసభ్యులు నలుగురు కలిసి రెండు బైక్‌‌లపై ఏదో పనిమీద బయటకు వచ్చారు.

చదవండి: స్వచ్చందంగా బయటకు రండి.. లేకపోతే దేశద్రోహులుగా మిగిలిపోతారు: విజయశాంతి

ఈ క్రమంలో  అతడి బైక్‌ను పోలీసులు ఆపడంతో బాధితుడు వారితో వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుల్  అశోక్.. బాధితుడిని కిందపడేసి విచక్షణ రహితంగా దాడి చేశాడు.

అక్కడున్న పోలీసులు అతన్ని విడిపించి పెట్రోలింగ్ జీపులో కూర్చోబెట్టారు. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న బాధితుడి కుమారుడు బెంబేలెత్తిపోయి.. ‘డాడీ వద్దు.. అంకుల్ ప్లీజ్’ అంటూ కన్నీళ్లతో వేడుకోవడం అందరినీ కలచి వేసింది.

ఈ వీడియో మంత్రి కేటీఆర్‌కు చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. కొంతమంది పోలీసుల ప్రవర్తనతో వేలాది మంది కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలను కోరారు. దీంతో మంత్రి, డీజీపీ ఆదేశాలతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డ కానిస్టేబుల్ అశోక్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.

 
- Advertisement -