25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం షాకింగ్: ఒక్క డాలర్.. రూ.144, పాకిస్తాన్‌ రూపాయి భారీ పతనం!

షాకింగ్: ఒక్క డాలర్.. రూ.144, పాకిస్తాన్‌ రూపాయి భారీ పతనం!

pakistan-rupee-1
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్తాన్ కరెన్సీ దారుణంగా పతనం అవుతోంది. శుక్రవారం అది మరింత పతనమై జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఒక డాలర్ ఏకంగా రూ.144కు చేరడం గమనార్హం. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం తమ వంద రోజుల పాలనను సెలబ్రేట్ చేసుకున్న మర్నాడే పాకిస్తాన్ రూపాయి దారుణంగా పతనమైంది.

శుక్రవారం ఒక్క రోజే రూ.10 పతనమైంది. దేశానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయంటూ వంద రోజుల పాలన సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినా.. కరెన్సీ పతనాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో ఓ రకమైన భయం నెలకొన్నదని, అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

అయితే.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ప్యాకేజీ అందుకోవడంలో భాగంగా.. కావాలనే పాకిస్తాన్ ఇలా రూపాయి విలువను తగ్గించిందని నిపుణులు చెబుతున్నారు.

ఈ మధ్యే ఐఎంఎఫ్ అధికారులు పాకిస్తాన్‌లో పర్యటించిన సందర్భంగా చైనా చేస్తున్న ఆర్థిక సాయాన్ని వెల్లడించడంతోపాటు ఇంధన ధరలను పెంచాలని, మరిన్ని పన్నులు విధించాలని, రూపాయి విలువను తగ్గించుకోవాలని షరతులు విధించారు. ఐఎంఎఫ్‌తో ఒప్పందానికి ముందే రూపాయి విలువను తగ్గిస్తారన్న అంచనా ఉన్నట్లు ఎక్స్‌చేంజ్ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్ అధికారి జాఫర్ పరాచా చెప్పారు.

- Advertisement -