హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది నాయకులకు కీలక బాధ్యతలు కట్టబెడుతోంది. మాజీ క్రికెటర్, మాజీ ఎంపి మహ్మద్ అజారుద్దీన్‌ను టీపీసీసీకి మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఇంకా మరికొందరికి కూడా పదవులు లభించాయి. ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అజార్‌కు తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీపీసీసీకి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ్ కుమార్‌లు వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా వ్యవహరిస్తుండగా ఈ జాబితాలో తాజాగా అజారుద్దీన్ కూడా చేరాడు.
ఆయనతో పాటు మరికొంత మంది నాయకులకు కూడా టీపీసీసీలో స్థానం కల్పించారు.
బి.ఎమ్.వినోద్ కుమార్, జాపర్ జావేద్‌లను తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నియమించగా, జనరల్ సెక్రటరీలుగా ఎస్.జగదీశ్వర్ రావు, నగేష్ ముదిరాజ్, టి.నర్సారెడ్డి, మానవతారాయ్, ఫహీమ్, కైలాష్, క్రిషాంక్, లక్ష్మారెడ్డిలను నియమించారు. కార్యదర్శులుగా దుర్గం భాస్కర్, దరువు ఎల్లన్న, విజయ్ కుమార్, బాల లక్ష్మిలను నియమిస్తున్నట్లు ఏఐసిసి జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
INC COMMUNIQUE
Appointment regarding office bearers of Telangana Pradesh Congress Committee. pic.twitter.com/aaGV3uCB8r
— INC Sandesh (@INCSandesh) November 30, 2018