జకార్తా : ఇండోనేషియా లంబోక్ దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభంవించింది. ఈ ఉపద్రవంలో తొలుత 80 మందికిపైగా మృతి చెందగా, వేలాది పౌరులు తీవ్ర గాయలపాలయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0 శాతంగా నమోదైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ ఘటన జరిగిన కొన్నిగంటలపాటు స్పల్ప భూప్రకంపనలు కొనసాగాయి.
పసిఫిస్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గత నెల 29న లంబోక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో 17 మంది చనిపోగా, వందలాది ఇళ్లు ధ్వంసమయిన విషయం తెలిసిందే.
సోమవారంనాటి భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. వందాలాది ఇళ్లు ధ్వంసంకాగా, వేలాదిమంది ప్రజలు నిరాశ్రలయ్యరు. నిజానికి అధికారులు ఆదివారమే భారీ భూకంప హెచ్చరికల నేపథ్యంలో సునామీ హెచ్చరికల్ని కూడా జారీ చేశారు. భూకంపం కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరికొంతమంది మరణించడంతో మృతుల సంఖ్య 98కి చేరింది.