- Advertisement -
ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫాం, ఇన్‌స్టాగ్రామ్ సేవలు మరోసారి ప్రపంచంలోని పలు దేశాల్లో నిలిచిపోయాయి, డెస్క్‌టాప్, మొబైల్ వెర్షన్‌లు రెండు కూడా పని చేయలేదు. ఇండియా, కెనడా, యూరప్లతో పాటు అమెరికాలో కూడా కొన్ని గంటలపాటు ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ డేటా ములంగా బుధవారం ఈ సేవలు ఆగిపోయాయి. వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ అయిననపుడు ‘5XX సర్వర్ ఎర్రర్’ అని చూపించింది.
ఒక గంట వ్యవధిలోనే దాదాపు వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ అసౌకర్యంపై సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా తమ ఆగ్రహని తెలియజేస్తూ… జోకులను పోస్ట్ చేశారు. ఈ విషయంపై ఇంకా ఇన్‌స్టాగ్రామ్ స్పందించలేదు
- Advertisement -