27.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం భారతీయ సినిమాలపై నిషేధం విధిస్తున్నాం: పాక్

భారతీయ సినిమాలపై నిషేధం విధిస్తున్నాం: పాక్

fawad
- Advertisement -


న్యూఢిల్లీ: తమ దేశంలో ఇక భారత సినిమాలు విడుల చేయడం జరగదని పాకిస్థాన్ స్పష్టం చేసింది. భారతీయ సినిమాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే.

బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావరంపై బాంబుల వర్షం కురిపించడంతో జైషే అధినేత మసూద్‌ అజార్‌ బావమరిది సహా 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ నేపథ్యంలో భారత్‌ సినిమాల్ని నిషేధిస్తున్నట్లు పాకిస్థాన్‌ సమాచార మంత్రి ఫవాద్‌ చౌదరి ప్రకటించారు.

మేడిన్ ఇండియా ప్రకటనలపైనా నిషేధం

మేడిన్‌ ఇండియా ప్రకటనల్ని కూడా నిషేధించాలని పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎమ్‌ఆర్‌ఏ)కి సూచించారు. భారత కంటెంట్‌ను సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ బహిష్కరించింది. ‘ఇక పాకిస్థాన్‌లో భారత్‌ సినిమాలు విడుదల కావు. మేడిన్‌ ఇండియా ప్రకటనలకు వ్యతిరేకంగా పీఈఎమ్‌ఆర్‌ఏ వ్యవహరించాలని సూచించాం’ అని ఫవాద్‌ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్థాన్‌ కళాకారులతో కలిసి పనిచేయకూడదని భారత చిత్ర పరిశ్రమ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు పాక్ భారత సినిమాలపై నిషేధం విధించడం గమనార్హం.

చదవండి: పాక్‌పై వైమానిక దాడిలో హైదరాబాదీ పైలట్! మిరాజ్ పైలట్లకు సిటీలోనే శిక్షణ?

- Advertisement -