

హైదరాబాద్: గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో చేర్చింది. ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డె నటిస్తున్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమాకు సంబంధించిన చిన్న టైటిల్ టీజర్, పోస్టర్ తప్ప ఎలాంటి అప్ డేట్స్ లేవు.
శరవేగంగా షూటింగ్..
అంతే కాదు ఈ సినిమా పై మొదటి నుంచి రక రకాల రూమర్లు కూడా పుట్టుకు వస్తున్నాయి. రిలీజ్ డేట్ విషయంలో ఎన్నో కాంట్రవర్సీలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మహేశ్ బాబు .. అల్లరి నరేశ్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
An update about #Maharshi…
Shooting part will be completed by March 15th except for 2 songs. Post Production is going on simultaneously in full swing.
All set for April 25th Release.@urstrulyMahesh @directorvamshi@hegdepooja @allarinaresh @ThisIsDSP @kumohanan1 #SSMB25
— Sri Venkateswara Creations (@SVC_official) February 27, 2019
‘మహర్షి’ సినిమా వాయిదా పడుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ లో సినిమా వచ్చే ఛాన్స్ లేదని, జూన్ కి వెళ్లేలా ఉందని అన్నారు. అయితే ఈ వార్తలు తెలుసుకున్న మహేష్ బాబు కాస్త సీరియస్ అయినట్లే కనిపిస్తుంది. దర్శక నిర్మాతలతో ఈ విషయాన్ని గురించి చర్చించి, వెంటనే క్లారిటీ ఇవ్వమని చెప్పాడట.
దాంతో దిల్ రాజు రంగంలోకి దిగిపోయి, ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా ఏప్రిల్ 25కి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో ‘మహర్షి’ విడుదల వాయిదాపై వస్తోన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
చదవండి: మహేష్ బాబు కొత్త సినిమా బడ్జెట్.. కంట్రోల్ తప్పుతోందా..?








