

టాలీవుడ్: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , అక్కినేని వారసుడు నాగ చైతన్య హీరోలుగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వెంకీమామ’. రీసెంట్ గా ఈ చిత్ర మొదటి షెడ్యూల్ రాజమండ్రి లో ప్రారంభమైంది. గోదావరి నది తీరాన వెంకీ , చైతూ లపై ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరించారు.
మరో f2 అవుతుందా…
ఈ చిత్రీకరణ కు సంబంధించిన వీడియో లీకై ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.26 సెకండ్ల నిడివి గల ఈ వీడియో లో వెంకటేష్ , నాగ చైతన్య లు ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించారు. ఈ వీడియో బయటకు రావడం తో చిత్ర యూనిట్ అప్రమత్తం అయ్యింది. ఇకపై షూటింగ్ సమయంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
#VenkyMama Leaked footage is going Viral on social networks, #Venkatesh & #NagaChaitanya looking promising..!!! pic.twitter.com/edT4Vp1bI4
— Sreedhar Marati (@SreedharSri4u) February 26, 2019
ఫుల్లెన్త్ కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ , చైతు కు జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మద్యే వెంకటేష్ నటించిన f2 బంపర్ హిట్ అయ్యింది. తాజాగా వెంకీ మామ కూడా పూర్తీ కామెడీ తో వస్తుండడం తో మరోసారి f2 మ్యాజిక్ రిపీట్ అవుతుంది అని చిత్ర యూనిట్ భావిస్తుంది.








