23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం గిన్నిస్ రికార్డు: 21 ఏళ్ల వయస్సులోనే ప్రపంచాన్ని చుట్టేసిన యువతి

గిన్నిస్ రికార్డు: 21 ఏళ్ల వయస్సులోనే ప్రపంచాన్ని చుట్టేసిన యువతి

- Advertisement -

వాషింగ్టన్: పక్షిలా రెక్కలుంటే ప్రపంచాన్ని చుట్టేసేవాళ్లం అనిపిస్తుంది అందరికీ. కానీ మనుషులం కదా ప్రపంచం మొత్తం చుట్టేయడం చాలా కష్టమే. ఆర్థిక పరిస్థితులు కూడా ఇందుకు ఓ కారణం. కనీసం మన దేశం మొత్తాన్ని చూసి వద్దామన్న సహకరించని పరిస్థితులు. కానీ అమెరికాకు చెందిన 21 ఏళ్ల యువతి ప్రపంచాన్ని చుట్టేయాలన్న తన కలను నెరవేర్చుకుంది. ఎన్నో ఒడిదుడుకులకు ఓడ్చి 196 దేశాలను చుట్టేసి… అతి చిన్న వయస్సులో ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీంతో అంతకు ముందు 24 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మీద ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది.

చదవండి: ప్రజాప్రతినిధులంతా బంట్రోతులే ..వైసీపీకి బాలయ్య కౌంటర్

చిన్నప్పటి నుంచే తనకు ప్రపంచాన్ని చుట్టేసి రావాలనే కల ఉండేదాని… దీంతో 12 ఏళ్ల నుంచే డబ్బులు దాచుకుంటూ వస్తున్నానని తెలిపింది లెక్సి ఆల్ఫ్రెడ్. ఇందుకోసం ప్రతీ పనిని చేసుకుంటూ వచ్చానని చెప్పింది. బాల్యంలో పాఠశాలకు సెలవులు ఇచ్చినప్పుడు స్వతంత్రంగా బ్రతకాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు పంపించే వారని… అదే ఈ కలకు పునాది వేసిందని తెలిపింది.

వాల్డ్ టూర్ కు సంబంధించిన డబ్బులు సమకూర్చుకునేందుకు తన ఫ్యామీలీకి చెందిన ట్రావెల్ ఏజెన్సీలోనే పని చేసినట్లు తెలిపింది ఆల్ఫ్రెడ్. 2016 నుంచే గిన్నిస్ రికార్డ్ పై దృష్టి సారించిన ఆమె…. ప్రతీ దేశంలోను తాను గడిపిన ఆధారాలను సేకరించింది. 196 దేశాల్లో పర్యటించినట్లు ఉన్న ఆధారాలను గిన్నిస్ బుక్ కు అందించనుంది.

కాగా.. తాను ఒక్కో దేశంలో మూడు రోజుల కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదని… లగ్జరీగా కాకుండా తక్కువ ధరలో దొరికే వసతులకే ప్రిఫరెన్స్ ఇచ్చానని తెలిపింది రికార్డ్ హోల్డర్.

- Advertisement -