31.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం రష్యాలో ఘోర విమాన ప్రమాదం…41 మంది దుర్మరణం

రష్యాలో ఘోర విమాన ప్రమాదం…41 మంది దుర్మరణం

Forty-one people killed in Russian passenger plane fire
- Advertisement -

 

మాస్కో: రష్యా రాజధాని మాస్కో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది చనిపోగా…పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని అత్యవసర చికిత్సకై స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే….

షెరెమెత్యేవో ఎయిర్‌పోర్ట్ రన్‌వే పైనుంచి టేకాఫ్ అయిన సుఖోయ్-492 విమానం కొద్దిసేపటికే.. సాంకేతిక కారణాలతో విమానం ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఆ క్రమంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఇక విమానంలో మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందుకుని ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ.. మంటలు మాత్రం ఆర్పలేకపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో బలంగా రన్‌వేను తాకడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

అయితే ప్రమాద సమయంలో మొత్తం 78 మంది ప్రయాణికులు వరకు విమానంలో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందారని, మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారని మాస్కో ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. విమాన ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విచారం వ్యక్తం చేశారు.

చదవండి:షాకింగ్: నదిలో ల్యాండైన విమానం! త్రుటిలో ప్రమాదం తప్పించుకున్న136 మంది…

- Advertisement -