25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ అక్కడ టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకేనట….

అక్కడ టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకేనట….

- Advertisement -

అమరావతి: ఏప్రిల్ 11న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-వైసీపీ పార్టీలు హోరాహోరీగా తలపడిన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు విడుదలకి ఎక్కువ సమయం ఉండటంతో…టీడీపీ-వైసీపీలు గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు.

ఆ జిల్లాలో మాకే ఎక్కువ పట్టు ఉంది…ఈ నియోజకవర్గంలో మెజారిటీ మాదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా పెనుగొండలో మరోసారి టీడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ  నేతలు లెక్కలు వేస్తున్నారు.

మొదట నుంచి పెనుగొండ టీడీపీకి కంచుకోటగా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్క 1989లో తప్ప మిగిలిన అన్నీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది.  గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బీకే పార్థసారధి, తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శంకరనారాయణపై దాదాపు 17 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

గెలుపుపై బీకే లెక్కలు…

ఈ సారి కూడా ఈ ఇద్దరు నేతలు మరోసారి ప్రత్యర్ధులగా తలపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బీకే పార్థసారధి తన గెలుపుపై ఫుల్ ధీమాగా ఉన్నారు. అంతర్జాతీయ కార్ల పరిశ్రమ కియా పెనుకొండకు రావడమే తమకు అతి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని పార్థసారథి నమ్మకంతో ఉన్నారు.

కియా రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభించడంతో….అక్కడి ఎక్కువ ఓటర్లు టీడీపీ వైపే మొగ్గు చూపారంటున్నారు. మరోవైపు అభివృద్ధితో పాటు సంక్షేమపథకాలు కూడా కలిసొస్తాయని బీకే అంటున్నారు.

అటు టీడీపీ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకిత, వైసీపీ వేవ్ తన విజయానికి కారణమవుతాయని వైసీపీ అభ్యర్థి శంకరనారాయణ కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే పెనుగొండిని మరోసారి టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం నిజమో  కాదో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

చదవండి:చంద్రబాబు జోష్ వెనుక ఉన్న కారణం అదేనా..?

- Advertisement -