25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ చనిపోయిన విద్యార్ధుల ఫలితాల విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు….

చనిపోయిన విద్యార్ధుల ఫలితాల విషయంలో ఎలాంటి తప్పు జరగలేదు….

Suicides not due to bungling of exam results, says Education board
- Advertisement -

హైదరాబాద్: ఆత్మహత్యలకు పాల్పడ్డ ఇంటర్ విద్యార్థుల మార్కుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తేల్చి చెప్పారు. అసలు ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనేది వాస్తవం కాదని అన్నారు.

ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల జవాబు ప్రతాలన్నీ రీవెరిఫికేషన్ చేశామని, ఒక విద్యార్థినికి 85 శాతం మార్కులు వచ్చినా ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. అలాగే మరో విద్యార్థిని అన్ని సబ్జెక్టులు పాసైనా ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు.

ఇక ప్రస్తుతం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయని, ఇవి పూర్తి అయ్యాక ఈ నెల 10వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అలాగే ఫలితాల వచ్చిన తర్వాత 15రోజులకు స్కాన్ చేసిన జవాబు పత్రాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

కాగా, ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా దాదాపు 20మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధులకి మద్ధతుగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఉచితంగా రీ-కౌంటింగ్ చేసి ఎలాంటి తప్పులు దొర్లకుండా మరోసారి ఫలితాలు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది.

చదవండి:ఇంటర్ ఇష్యూ: కేసీఆర్‌పై తిట్ల వర్షం కురిపిస్తున్న కాంగ్రెస్ నేతలు

- Advertisement -