34.1 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం షాకింగ్: గిన్నెలు కడిగే పనిమనిషి దావా.. హోటల్ యాజమాన్యానికి రూ.150 కోట్లు జరిమానా!

షాకింగ్: గిన్నెలు కడిగే పనిమనిషి దావా.. హోటల్ యాజమాన్యానికి రూ.150 కోట్లు జరిమానా!

maid
- Advertisement -

వాషింగ్టన్: తన అభిమతానికి వ్యతిరేకంగా తనతో ఆదివారాలు కూడా పనిచేయించారని ఓ పనిమనిషి కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం.. పదేళ్లపాటు ఆదివారాలు కూడా పనిచేసిన పనిమనిషికి హోటల్ యాజమాన్యం 21 మిలియన్ డాలర్లకుపైగా చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైతీకి చెందిన మేరీ జాన్‌ పియర్రే అనే మహిళ ఫ్లోరిడాలోని మియామీ నగరానికి వలస వచ్చారు. స్థానిక ఫైవ్‌స్టార్ హోటల్‌లో పనిమనిషి(వంటపాత్రలు శుభ్రం చేయడం)గా చేరారు. అయితే ఆమె ఆదివారాల్లో తప్ప మిగతా రోజుల్లో క్రమం తప్పకుండా పనికి వెళుతుండేవారు. ఎందుకంటే ఆమె ఆదివారాల్లో చర్చిలో పనిచేస్తుంటారు.

కనికరించని మేనేజర్

మతం పట్ల ఆమెకున్న అభిప్రాయాలను హోటల్‌ సిబ్బంది కూడా గౌరవించి ఆదివారం సెలవు ఇచ్చారు. కానీ, హోటల్‌లోని కిచెన్‌ మేనేజర్‌ మాత్రం ఆదివారాలు కూడా పనికి రావాలని మేరీని ఆదేశించారు. ఇందుకు మేరీ ఒప్పుకోలేదు. చర్చిలోని ఫాదర్‌కు సమస్యను వివరించి ఓ లేఖను రాయించారు. ఆదివారాలు కూడా పనిచేయడం తమ మతాన్ని అగౌరవపరిచినట్లు అవుతుందని రాశారు. ఈ లేఖను మేరీ హోటల్‌ మేనేజర్‌కు ఇచ్చారు.

అయినా, మేనేజర్‌ కనికరించలేదు. దీంతో పదేళ్ల పాటు మేరీ ఆదివారాలు పనిచేయాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల తోటి సిబ్బంది సాయంతో ఆదివారం సెలవు తీసుకునేవారు. ఈ విషయం మేనేజర్‌కు తెలీడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో మేరీ ఈఈఓసీ (సమాన ఉద్యోగ అవకాశ కమిషన్‌)ను ఆశ్రయించారు.

మతం పట్ల తనకున్న నమ్మకాలను హోటల్‌ సిబ్బంది అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ హోటల్‌లో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి అన్ని విషయాల్లో మద్దతు తెలుపుతున్న యాజమాన్యం మేరీ విషయంలో మాత్రం వ్యతిరేకత చూపారని న్యాయవాది మార్క్‌ న్యాయస్థానంలో వెల్లడించారు. అలా కొన్నేళ్ల పాటు నడిచిన ఈ కేసుపై ఫ్లోరిడాలోని ఫెడరల్‌ కోర్టు కొద్ది రోజుల క్రితం తీర్పు వెల్లడించింది.

భారీ జరిమానా

మేరీ మనోభావాలను దెబ్బతీసినందుకు ఎగ్గొట్టిన జీతం మొత్తంతో కలిపి హోటల్‌ యాజమాన్యం 21.5 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.150కోట్లు)కు పైగా చెల్లించాలని ఆదేశించింది. దీంతో హోటల్ యాజమాన్యం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ‘న్యాయస్థానం తీర్పు మమ్మల్ని ఎంతగానో బాధించింది. కేసులోని నిజానిజాలు తేలకుండా తీర్పు వెలువరించినట్లు అనిపిస్తోందని హోటల్ యాజమాన్యం తెలిపింది. అంతేగాక, మేరీ తమ హోటల్‌లో పనిచేసినంత కాలం ఆమెకు అనుకూలంగా ఉండే షిఫ్ట్‌లు వేశామని వెల్లడించింది. కాగా, మేరీ మాత్రం దేవుడిపై ఉన్న ప్రేమే తనకు న్యాయం చేసిందంటూ ఆనందం వ్యక్తం చసింది.

- Advertisement -