

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీలో చేరే విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శుక్రవారం స్పష్టతనిచ్చారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వంటేరు ప్రకటించారు. అయితే, తాను గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కాగా, గజ్వేల్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసిన వంటేరు రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన టీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వంటేరు టీఆర్ఎస్ పార్టీలోనే చేరనుండటం ఆసక్తికరంగా మారింది. కాగా, వంటేరు టీఆర్ఎస్ వస్తానని చెప్పినా తాము చేర్చుకోబోమని పార్లమెంటు సభ్యుడు, టీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
కేసీఆర్ నాకు బాస్: వంటేరు
తాను ఏదో ఒక రోజు గజ్వేల్ నుంచి గెలవాలనే రాజకీయాల్లో ఉన్నాని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. అయితే, తన పోరాటాలు సరికాదని.. ఇక తనకు కేసీఆర్ బాస్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని.. అందుకే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నాని వంటేరు చెప్పారు. పదవులు, డబ్బుల కోసం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు చదవండి..
కాంగ్రెస్‌కు భారీ షాక్: టీఆర్ఎస్‌లోకి వంటేరు ప్రతాప్ రెడ్డి, నేడు కేసీఆర్ సమక్షంలో చేరిక…








