చంద్రుడి చీకటి భాగంలో ఏముంది? గుట్టు లాగేందుకు చైనా ‘చాంగె-4’ రోవర్ ప్రయోగం…

- Advertisement -

china-moon-probe-rover-change-4

బీజింగ్: భూమ్మీద నుంచి చూసే మనకు.. ఎప్పుడూ కనిపించేది చంద్రుడిలో సగ భాగం మాత్రమే. మిగతా సగ భాగం అంతా చీకటి ఆవరించుకుని ఉంటుంది. ఆ చీకటి భాగంలో ఏముంది? దీని గుట్టు తెలుసుకునేందుకు చైనా ముందడుగు వేసింది. శుక్రవారం చంద్రుడి అవతలి భాగం మీద‌కు ఒక రోవ‌ర్‌ను ప్ర‌యోగించింది.

చదవండి: దేవరహస్యం: మనిషికి ప్రాణం పోసే ‘దైవకణం’.. మిస్టరీ వీడుతుందా?

చాంగె 4 లూనార్ ప్రోబ్ మిష‌న్ పేరుతో ఈ ప్ర‌యోగానికి శ్రీకారం చుట్టిన చైనా శుక్రవారం జీచాంగ్ లాంచ్ సెంట‌ర్ నుంచి.. లాంగ్ మార్చ్ 3బీ రాకెట్ ద్వారా ఈ రోవర్‌ను ప్రయోగించింది. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే వచ్చే న్యూ ఇయర్ సమయానికి ఈ రోవర్ చంద్రుడి చీకటి భాగంలో దిగనుంది. ఈ ప్రయోగానికి చైనా పురాణాల ప్ర‌కారం ‘చాంగె’ అనే పేరు పెట్టారు.

చదవండి: అద్భుతం: ఏడు నెలలు ప్రయాణించి.. అంగారకుడిపై విజయవంతంగా దిగిన నాసా ‘ఇన్‌సైట్’…

చంద్రుడిపై ఉన్న చీకటి ప్ర‌దేశాల్లో ఈ ప్రోబ్ అన్వేష‌ణ జరపనుంది. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో ఈ ప్ర‌యోగం కీల‌క‌మైంద‌ని ఈ సందర్భంగా చైనా శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. భూమి దిశ‌గా క‌నిపిస్తున్న చంద్రుడి ఉప‌రిత‌లం చాలా ఫ్లాట్‌గా ఉంటుంది.

అయితే క‌నిపించ‌ని చీకటి ప్రదేశంలో ఎక్కువ శాతం కొండ‌లు, లోయ‌లు ఉంటాయి. తాజాగా చైనా ప్రయోగించిన రోవర్ చాంగె-4 ఆ ప్రదేశాల్లో తన అన్వేషణ జరుపుతుంది. చంద్రమండలంపై డార్క్ సైడ్‌గా పిలువ‌బ‌డే ప్ర‌దేశంపై ఒక రోవ‌ర్‌ను దింపడం ఇదే ప్రథమం.


 

- Advertisement -