- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లోరన్ నుంచి పూంజ్‌కు బయలుదేరిన ఒక బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 11 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.
పూంజ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్లెరా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ప్రమాద స్థలికి చేరుకున్న అధికారులు.. స్థానికుల సహాయంతో రక్షణ, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -