21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం వామ్మో.. ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షల బోనస్, ఆ దేశంలో అంతేమరి! ఎక్కడంటే…

వామ్మో.. ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షల బోనస్, ఆ దేశంలో అంతేమరి! ఎక్కడంటే…

bonus
- Advertisement -

bonus

బీజింగ్‌: ఏ కంపెనీ అయినా భారీగా లాభాలు వస్తేనో.. లేదంటే పండగల సందర్భంగానో తమ ఉద్యోగులకు కొంత మొత్తాన్ని బోనస్‌గా ప్రకటిస్తుండటం చూస్తూనే ఉంటాం. కానీ, చైనాలోని ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు కళ్లు చెదిరే మొత్తాన్ని బోనస్‌గా ప్రకటించి సంచలనం సృష్టించింది.
కంపెనీలో పనిచేస్తోన్న ప్రతి ఉద్యోగికి ఏకంగా రూ.62 లక్షలు చొప్పున బోనస్‌ ప్రకటించడం విశేషం.

వివరాల్లోకి వెళితే.. చైనాలో న్యూ ఇయర్‌ ఫెస్టివల్‌ సందర్భంగా కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో నాన్‌చాంగ్‌ నగరానికి చెందిన ఓ కంపెనీ బోనస్‌గా ఇచ్చేందుకు ఏకంగా 300 మిలియన్‌ యువాన్లు(సుమారు రూ.34 కోట్లు) నోట్ల కట్టలను పెద్ద గుట్టగా పేర్చింది.

ఈ డబ్బును కంపెనీ కార్యాలయంలో ప్రదర్శనగా కూడా ఉంచారు. ఈ కంపెనీలో దాదాపు 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఒక్కో ఉద్యోగికి రూ.62 లక్షల చొప్పున బోనస్‌ అందజేసిందీ కంపెనీ. దీంతో ఆ కంపెనీ ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇంత భారీ మొత్తం ఎలా ఖర్చుపెట్టాలో…

ఓ ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తాన్ని ఎలా ఖర్చుపెట్టాలో అర్థంకావడం లేదంటూ సంబరపడిపోయాడు. చైనాలో గతంలో కూడా పలు కంపెనీలు ఇలా తమ ఉద్యోగులకు భారీ మొత్తాలు చెల్లించాయి. ఓ కంపెనీ అయితే, డబ్బు కట్టలను పోసి మీకు ఎంత వీలైతే అంత మొత్తం తీసుకుపోవాలంటూ ఉద్యోగులకు ఆఫర్ చేసింది.

- Advertisement -