25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు మళ్లీ పెళ్లి చేసుకోనున్న రజినీ కుమార్తె సౌందర్య: ఎవరితో, ఎప్పుడంటే..?

మళ్లీ పెళ్లి చేసుకోనున్న రజినీ కుమార్తె సౌందర్య: ఎవరితో, ఎప్పుడంటే..?

soundarya
- Advertisement -

చెన్నై: సూపర్‌ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం ఈ యేడాది ఫిబ్రవరి 11న జరగనుందని తెలిసింది. ప్రముఖ వ్యాపార వేత్త, నటుడు విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకోనున్నారు. ‘వంజగర్‌ ఉళగమ్‌’ అనే చిత్రంలో విశగన్‌ నటించారు.

కాగా, ఇప్పటికే రజనీ కుంటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. సౌందర్య, విశాగన్‌‌ల నిశ్చితార్థం గత ఏడాది కుటుంబసభ్యులు, దగ్గరి బంధువుల సమక్షంలో జరిగింది. వివాహం మాత్రం చెన్నైలోని ఓ హోటల్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం.

మూడు రోజులపాటు వేడుకలు

ఫిబ్రవరి 9 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. మెహెందీ, సంగీత్‌ కార్యక్రమాలతో కలిపి మూడు రోజుల పాటు వివాహ వేడుక ఉండబోతోందట. లతా రజనీకాంత్ ఇచ్చే పార్టీతో పెళ్లి వేడుకలు ప్రారంభకానున్నాయి. కాగా,

సౌందర్య అక్క సినీ హీరో ధనుష్‌ భార్య ఐశ్వర్య స్వయంగా ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. గతంలో అశ్విన్‌ రామ్‌కుమార్‌ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న సౌందర్య 2017లో వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

- Advertisement -