
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మంధాన ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బన్నీ బర్త్‌డేను పురస్కరించుకుని ఇటీవల సినిమా టీజర్ విడుదల చేశారు. దీనికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. 400 మిలియన్ వ్యూస్ సాధించింది.
Also Read : ‘వకీల్ సాబ్’గా పవన్ ఇరగదీశాడట.. 4 స్టార్ రేటింగ్ ఇచ్చేశారు!
టీజర్‌లో పుష్ప లుక్స్‌తో పాటు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. తాజాగా, ఈ టీజర్‌పై కాపీ విమర్శలు వస్తున్నాయి.
టీజర్ బీజీఎంను హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి దేవీ శ్రీ కాపీ కొట్టాడని ఆరోపిస్తున్నారు. అవెంజర్స్ బీజీఎం, పుష్ప బీజీఎం రెండు ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం కానీ, దేవి శ్రీ ప్రసాద్ కానీ స్పందించలేదు. పుష్ప చిత్రం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపొందుతుంది.








