హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.
రాష్ట్రంలో ఈ సినిమా బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలకు అనుమతి ఇవ్వకపోవడంపై వివాదం మొదలైంది. రాజకీయ రంగు పులుముకున్న రగడపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి.
ఇటీవల ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ దియోధర్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌కు భయపడే వకీల్ సాబ్ సినిమా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదని, పవన్‌తో పాటు ఆయన సినిమాలకు వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు.
స్పందించిన మంత్రి పేర్ని నాని.. వకీల్‌సాబ్ సినిమాకు, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉందన్నారు. మీకు దురద ఉందని, మోజు ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు సునీల్ గారు అంటూ ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా నాగబాబు స్పదించారు. “మీకు ఏమయ్యింది నాని గారూ. మీరు కరోనా వాక్సిన్ తో పాటు రేబిస్ టీకా వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రేబిస్ వ్యాక్సిన్ టు మిస్టర్ నాని.స్టేట్ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ” అంటూ ట్వీట్ చేశారు.
మీకు ఏమి అయ్యింది నాని గారు.మీరు కారోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి.ఇట్స్ అర్జంట్.please సెండ్ రాబిస్ వాక్సిన్ to మిస్టర్ నాని.స్టేట్ transposrt మినిస్టర్.వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పెరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ. pic.twitter.com/4mkGm7NLeg
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 11, 2021