బ్రెజిల్‌లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 21 వేలపైగా కొత్త కేసులు

- Advertisement -

బ్రసీలియా: ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. ప్రధానంగా అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది.

ఈ నేపథ్యంలో బ్రెజిల్ దేశంలో గడిచిన 24 గంటల్లో 21వేలపైగా కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక్కడ మొత్తమ్మీద కొత్తగా 21,704 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8.5 లక్షలు దాటిపోయింది.

అదేవిధంగా కొత్తగా 892 కరోనా మరణాలు సంభవించాయని, దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 42,720కి చేరిందని అధికారులు తెలియజేశారు.

ప్రస్తుతం అమెరికా తర్వాత అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశం ఇదే.

- Advertisement -