26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం దేవుడా.. ఈ పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు! బంగ్లాదేశ్ యువకుడి దయనీయ గాథ…

దేవుడా.. ఈ పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు! బంగ్లాదేశ్ యువకుడి దయనీయ గాథ…

bangladesh-tree-man-abul-bajandar
- Advertisement -

ఢాకా: వింత వ్యాధితో బాధపడుతూ క్రమేణా చెట్టులా మారిపోతున్న యువకుడు.. పరిస్థితి విషమించడంతో మళ్లీ ఆసుపత్రిపాలయ్యాడు. బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ బజందర్(28) హ్యూమన్ పపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) వ్యాధితో బాధపడుతున్నాడు.

అతడి అరచేతులు మొత్తం చెట్టు బెరడులా మారిపోవడంతో గతంలో పలుమార్లు శస్త్రచికిత్సలు కూడా చేయించుకున్నాడు. కానీ వ్యాధి తగ్గకపోగా మళ్లీ మళ్లీ అరచేతులు, అరికాళ్లు చెట్టు బెరడులా మారిపోతుండడంతో భజేందర్‌ పరిస్థితి దయనీయంగా మారింది.

పుట్టుక నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్న అబుల్ బజందర్‌కు 2016లో ఢాకా వైద్య కళాశాల ఆసుపత్రి వైద్యులు మొత్తం 16 శస్త్రచికిత్సలు నిర్వహించి అతడి అరచేతులకు ఉన్న పులిపిర్లు తొలగించారు. శరీరంలో రోగనిరోధక శక్తి బాగా క్షీణించడం వల్ల ఇలాంటి వ్యాధి అతడికి వచ్చినట్లుగా అతడికి చికిత్స చేసిన వైద్యులు చెప్పారు.

బతికినంత కాలం ఇదే సమస్య అయితే ఎలా?

అయితే ఆ తరువాత కూడా అవి మళ్లీ మళ్లీ మొలుస్తుండడంతో ఈ క్రమంలో ఇప్పటి వరకు మొత్తం 25 ఆపరేషన్లు చేశారు. అయినా అతడి వ్యాధి తగ్గకపోగా మరింత తీవ్రమైంది. దీంతో బజందర్ తాజాగా ఆసుపత్రిలో చేరాడు.

అతడి అరచేతులు, పాదాల నిండా పులిపిర్లు బాగా పెరిగిపోవడంతో ప్రస్తుతం అవి చెట్టు బెరడు మాదిరిగా కనిపిస్తున్నాయి. పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో ఢాకా ఆసుపత్రిలోని బర్న్ యూనిట్ విభాగం వైద్యుడు సమంత లాల్ సేన్ మళ్లీ బజందర్ చేతులు, కాళ్లకు శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

దీనికోసం ఆయన ప్రత్యేకంగా తొమ్మిది మంది వైద్యులతో కూడిన బ‌ృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా పగవాళ్లకు కూడా ఇలాంటి వ్యాధి రాకూడదంటూ అబుల్ బజందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

- Advertisement -