అమెరికా: ఎంతో కష్టపడి లాభల్లోకి తెచ్చిన వ్యాపారంపై ఎవరైనా చిన్న ఆరోపణలు చేస్తేనే మనం మండి పడతాం. అలాంటిది తనను ప్రపంప కుబేరుల జాబితాలో నిలిపిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గురించి ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం లాభాలతో దూసుకుపోతున్న అమెజాన్ ఎప్పటికైనా కుప్పకూలి దివాలా తీయడం ఖాయమంటూ జెఫ్ బెజోస్ జోశ్యం చెప్పారు.
అమెరికాలోని అమెజాన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులతో జెఫ్ బెజోస్ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన జవాబులు చెప్పారు. ఈ క్రమంలో ఓ ఉద్యోగి ‘రిటైల్ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా కొన్ని దిగ్గజ సంస్థలు దివాలా తీయడం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు..?’ అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు సీఈవో బెజోస్ చెప్పిన సమాధానం.. ఆ ప్రశ్న అడిగిన ఉద్యోగితో పాటు అక్కడ ఉన్న అందరినీ షాక్‌కు గురిచేసింది.
‘‘ఎంతటి దిగ్గజ కంపెనీ అయినా ఏదో ఒక సమయంలో నష్టపోవడం ఖాయం… ఏ సంస్థ కూడా మూడు దశాబ్దాలకు పైబడి మనుగడ సాగించలేదు.. అలాంటి సంస్థల్లో అమెజాన్ కూడా ఒకటి… ఇది కూడా ఏప్పుడో ఒకప్పుడు కుప్పకూలి దివాలా తీయడం ఖాయం..’’ అని జెఫ్ బెజోస్ అనడంతో అక్కడి ఉద్యోగులు షాక్ తిన్నారు.
‘‘కానీ అమెజాన్‌కి అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు సంస్థ ఉద్యోగులు అందరూ కష్టపడి పని చేయాలి..’’ అని సీఈవో జెఫ్ బెజోస్ సూచించడం గమనార్హం.