నిజమేనా? ప్రభాస్ పెళ్లి.. అమెరికా బిజినెస్ మాన్ కూతురితోనా?

tollywood-hero-prabhas
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి ఓ తాజా పుకారు టాలీవుడ్ వర్గాలలో షికారు చేస్తోంది. కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లిపై ఏవేవో వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ‘బాహుబలి’ వివాహం గురించిన వార్తలు కాస్త స్ట్రాంగ్‌గానే వినిపిస్తున్నాయి.

అమెరికాకు చెందిన ఒక బిజినెస్‌మాన్ కుమార్తెను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు, ఇతర వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. గతంలోనూ ఇలాంటి వార్తలెన్నో ప్రచారంలోకి వచ్చి ఆ తరువాత ఒట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి.

తన సహ నటి అనుష్క శెట్టితో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తొలుత వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఇటు అనుష్క, అటు ప్రభాస్ ఖండించారు. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని అంతకు మించి మరే రిలేషన్ లేదని వారు స్పష్టం చేశారు.

మరోవైపు హీరో ప్రభాస్ పెళ్లి గురించి అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం ప్రభాస్ వయసే. యంగ్ రెబల్ స్టార్ 40కి దగ్గరవుతున్న కొద్దీ వారిలో టెన్షన్ పెరుగుతోంది.

ఎందుకంటే, 40 ఏళ్ల వయసులోపే తమ అభిమాన హీరో పెళ్లి జరిగిపోవాలనేది వారి కోరిక. మరి వారి కోరిక ఈ సంవత్సరమైనా తీరుతుందా? ఈసారైనా ప్రభాస్ పెళ్లి వార్తలు నిజం అవుతాయా? అనేది వేచి చూడాల్సిందే.

ఇక ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్.

నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవలీన్ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన యాక్షన్ సినిమాలు అన్నింటినీ మించి పోయేలా ఈ చిత్రం ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.

- Advertisement -